టీఎస్పీఎస్సీ గురుకులాల ప్రిన్సిపల్ అభ్యర్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. నోటిఫికేషన్లో ఉన్న చిన్న చిన్న లోపాలతో దాదాపు 35 మంది మహిళా అభ్యర్థులు నష్టపోతున్నామని వారు సంజయ్‌కి వివరించారు.
ఈ మేరకు వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్ని సార్లు టీఎస్పీఎస్సీకి విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వేడుకున్నారు.
ఇదీ చూడండి : 14వ సారి యాదాద్రిని సందర్శించనున్న కేసీఆర్