ETV Bharat / state

Bandi Sanjay: 'నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై హైదరాబాద్​లో మిలియన్​ మార్చ్'​ - ts news

Bandi Sanjay: రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ అనుబంధ విభాగాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపునిచ్చారు. వర్చువల్​ సమావేశంలో మోర్చాల పనితీరును సమీక్షించిన సంజయ్​.. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు హైదరాబాద్​లో మిలియన్ మార్చ్’ నిర్వహించాలని బండి సంజయ్ పార్టీ నేతలకు సూచించారు.

Bandi Sanjay: 'నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై హైదరాబాద్​లో మిలియన్​ మార్చ్'​

author img

By

Published : Jan 29, 2022, 3:20 AM IST

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై హైదరాబాద్​లో మిలియన్ మార్చ్’ నిర్వహించాలని బండి సంజయ్ పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్ పాలన పట్ల జనం విసిగిపోయారని. తెరాసను ధీటుగా ఎదిరించే పార్టీ భాజపా మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్, మహిళా, మైనారిటీ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఆయా మోర్చాల జిల్లా, మండల కమిటీల ఏర్పాటు, జిల్లా, కార్యవర్గ సమావేశాల తీరుతెన్నులు, కేంద్ర పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడానికి మోర్చాలు చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపడుతున్న కార్యక్రమాలు, ఆయా మోర్చాలు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు సుధీర్ఘంగా సమీక్షించారు.

ఈసారి భాజపాకు ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం ఆలోచిస్తున్నారని... ఇటీవల వెల్లడైన ఓ సర్వే సంస్థ ఫలితాలే నిదర్శనమన్నారు. పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నందున... అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నందున మోర్చాల నాయకులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తూ కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో మోర్చాల పనితీరును మరింతగా మెరుగుపరచుకోవాలని కోరారు. రాష్ట్రంలో భాజపా నేతలకు ఏ కష్టమొచ్చినా, ఆపదొచ్చినా ఆదుకునేందుకు జాతీయ నాయకత్వం సిద్దంగా ఉందని.. కరీంనగర్​లో తనపై, నిజామాబాద్​లో అర్వింద్​పై దాడి జరిగిన వెంటనే జాతీయ నాయకత్వం స్పందించిన తీరే ఇందుకు నిదర్శనమని భాజపా నేతలకు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.