మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొని ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ప్రణబ్ ముఖర్జీ మొదటి నుంచి గొప్ప జాతీయ భావం కలిగిన వ్యక్తి అని పశ్చిమబంగ అభివృద్ధికి, ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పోరాటం చేసిన యోధుడు బండి సంజయ్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ అన్ని పార్టీలతో సఖ్యత కలిగి ఉన్నారన్నారు. ప్రణబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.