ETV Bharat / state

పేపర్​ లీకేజీ విషయంలో.. మార్చి 25న ప్రత్యేక కార్యక్రమాలు: బండి సంజయ్​ - బీజేపీ నాయకులతో మాట్లాడిన బండి సంజయ్​

BJP Dharna On March 25 On TSPSC Paper Leakage: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ, జర్నలిస్టులు, మీడియా ఛానెల్స్​పై జరుగుతున్న దాడుల అంశంపై మార్చి 25న బీజేపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం హైదరాబాద్​లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగింది.

bjp state president bandi sanjay
bjp state president bandi sanjay
author img

By

Published : Mar 22, 2023, 4:50 PM IST

BJP Dharna On March 25 On TSPSC Paper Leakage: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ మార్చి 25న ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చర్చించారు. అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో హైదరాబాద్​లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.​ టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీలో ప్రశ్నిస్తున్న గొంతుకులను ప్రభుత్వం సిట్​ ద్వారా నోటీసులు జారీ చేస్తూ నొక్కాలని చూస్తోందని చెప్పారు.

ఈ ప్రశ్నించే గొంతుకులను కాపాడుకోవాలని బీజేపీ నేతలకు బండి సంజయ్​ వివరించారు. ప్రశ్నించే వారిపై, యూట్యూబ్​ ఛానల్స్​పై ప్రైవేటు వ్యక్తులతో దాడులు చేయించి ఈ ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. అయితే ఈ పేపర్​ లీకేజీ, మీడియాపై దాడులు, జర్నలిస్టుల అరెస్టుల అంశాలపై పార్టీ నేతలతో చర్చించి.. అందుకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. తీన్మార్​ మల్లన్న అరెస్టును ఖండిస్తూ.. తనకు బెయిల్​ ఇప్పించేందుకు బీజేపీ లీగల్​ సెల్​ కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విజయశాంతి, వివేక్​ ,ఏవీఎన్​ రెడ్డి, రామచందర్​ రావు, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తన ఇంటికి ఎటువంటి నోటీసులు అంటించలేదు: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీలో విమర్శలు చేస్తున్న బండి సంజయ్​కు సిట్​ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న విచారణకు హాజరుకావాలన్నారు. నోటీసులు ఇచ్చే క్రమంలో ఇంటిలో ఎవరు లేకపోవడంతో తలుపుకు అంటించి వెళ్లిపోయారు. ఈ విషయంపై బండి సంజయ్​ స్పందిస్తూ సిట్​ అందించిన నోటీసులు తనకు అందలేదని పేర్కొన్నారు. ఏ ఇంటికి అధికారులు నోటీసులు అంటించారో.. తను ఇంటికి వెళ్లేసరికి చిరిగిపోయిన కాగితం ఉందని తెలిపారు. సిట్​ అధికారులు నోటీసులు తనకు కాకుండా సీఎం కేసీఆర్​.. ఐటీ మంత్రి కేటీఆర్​కు ఇవ్వాలని సూచించారు. ఎందుకంటే పేపర్​ లీకేజీలు సర్వసాధారణమని ఓ మంత్రి అనడం ఏంటని ప్రశ్నించారు.

నిరుద్యోగ మార్చ్​ చేపడతాం: తీన్మార్​ మల్లన్న, విఠల్​, సతీష్​ కమల్​లను అరెస్టు చేయడం సిగ్గు చేటని సంజయ్​ అన్నారు. ఏమీ లేని సీఎం కేసీఆర్​కు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్​ క్యాలెండర్​ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మిలియన్​ మార్చ్​ స్ఫూర్తితో నిరుద్యోగ మార్చ్​ కూడా చేపడతామని తెలిపారు. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వ్యవహారంలో దోషులకు శిక్షపడేవరకు తమ పోరాటం సాగుతుందని బండి సంజయ్​ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.