అన్నదాతలకు మద్దతుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పోరాటం ప్రారంభించనున్నారు. రైతులకు సంఘీభావంగా రేపు ఉదయం 10 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో దీక్ష చేయనున్నారు.
లాక్‌డౌన్‌కు ప్రజలు, రైతులు సహకరిస్తున్నా.. ప్రభుత్వం కర్షకుల సమస్యలు పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు ఆలస్యం కావడం, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఐకేపీ సెంటర్‌ల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి నెలకొందన్నారు. రేపటి ఉపవాస దీక్షలో రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఇలా అందరూ ఎవరి ఇంట్లో వారు దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్