ETV Bharat / state

'ప్రజలను మోసం చేసేందుకు కొత్త డ్రామా'

కేసీఆర్ కేంద్రంలో చేరుతున్నారంటూ కొత్త డ్రామాకు తెర తీశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బహిరంగంగా ఈ విషయం చర్చించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అంటూ సవాలు విసిరారు.

bandi-sanjay-kumar-allegations-on-cm-kcr
'ప్రజలను మోసం చేసేందుకు... కొత్త డ్రామాకు తెరలేపారు'
author img

By

Published : Jan 24, 2021, 7:56 PM IST

కేంద్ర ప్రభుత్వంతో చేరుతున్నానంటూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని.. కుటుంబ పాలన చేసే వ్యక్తితో మేమెందుకు పొత్తు పెట్టుకుంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులను నమ్మించేందుకు.. సమాజాన్ని నాశనం చేసేందుకు కేసీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని ఆరోపించారు.

తెరాస నేతలను, మంత్రులను మోసం చేసేందుకు కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని సంజయ్ పేర్కొన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రంలో చేరబోతున్నామని చెప్పే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేవారే.. మంత్రి పదవులు రాకపోతే కొత్తపార్టీ పెడతారని ఆరోపించారు. అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం కలిసి కట్టుగా పనిచేద్దామని.. ఈ విషయంపై రాజకీయాలు చేయడం ఆపాలని కోరారు.

ఇదీ చూడండి: తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.