ETV Bharat / state

యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం: బండి సంజయ్ - bandi sanjay latest tweet

Bandi Sanjay Tweet Today : కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేపు యాదాద్రిలో కేసీఆర్​ సహా ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో బండి సంజయ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్
author img

By

Published : Jan 17, 2023, 12:58 PM IST

Bandi Sanjay Tweet Today : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రేపు ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించే బీఆర్​ఎస్​ సమావేశానికి ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశంగా చూపించేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలను కేసీఆర్‌ ఆహ్వానిస్తున్నారా అని ప్రశ్నించారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడిగా, పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని ట్విట్టర్‌ టిల్లు చెప్పారంటూ బండి సంజయ్ ట్వీట్‌ చేశారు.

  • Temples have become business centers for Kalvakuntla family. Yadadri development is an investment & public contributions to holy Hundi are returns says #TwitterTillu

    Is KCR taking other states CMs to showcase Hindu temple as investment opportunity ahead of BRS Khammam meeting ?

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కల్వకుంట్ల కుటుంబానికి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇతర రాష్ట్రాల సీఎంలను యాదాద్రికి ఎందుకు తీసుకెళ్తున్నారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారు." - ట్విటర్​లో బండి సంజయ్‌

అసలు విషయం ఏంటంటే..: ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్​ఎస్​ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్​సింగ్ మాన్, పినరయి విజయన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, పలువురు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. ఇందుకోసం జాతీయ నేతలంతా నేడు సాయంత్రం హైదరాబాద్​కు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో అల్పాహారం చేశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరుతారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్​ తాజాగా సీఎం కేసీఆర్​పై విమర్శలు చేశారు.

జాతీయ నేతల షెడ్యూల్​ ఇదే..

  • 17 రాత్రికి జాతీయ నేతలంతా హైదరాబాద్‌ చేరుకుంటారు.
  • యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్​కు మంత్రి తలసాని స్వాగతం పలుకుతారు.
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్​, పంజాబ్ సీఎం భగవంత్​సింగ్ మాన్​కు మంత్రి మహమూద్‌ అలీ స్వాగతం చెబుతారు. ప్రొటోకాల్ చూస్తారు.
  • కేరళ సీఎం పినరయి విజయన్​కు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నేత డి.రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌ స్వాగతం పలుకుతారు.
  • 18న ఉదయం జాతీయ నేతలంతా సీఎం కేసీఆర్​తో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు.
  • ఆ తర్వాత సీఎం కేసీఆర్​తో కలిసి వారంతా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
  • యాదాద్రి నుంచి రెండు హెలికాప్టర్లలో ఖమ్మం బయలుదేరుతారు.
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది.

ఇవీ చూడండి..

భారీ హోర్డింగ్​లు.. నేతల కటౌట్​లతో ఖమ్మం నగరం.. గులాబీమయం

ఉన్నత ఉద్యోగాన్ని వదిలి గుడిలో పూజారిగా.. వారి కోసం ప్రత్యేక యాప్ సృష్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.