BJP Leader Bandi Sanjay Delhi Tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులకు తెలియకుండా రహస్యంగా వెళ్లడం వల్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులుగా బండి సంజయ్ దిల్లీలో ఏమీ చేస్తున్నారనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఉత్పన్నమవుతోంది. సోమవారం దిల్లీ వెళ్లిన సంజయ్ రెండు రోజులుగా పార్టీ అగ్ర నేతలతో వరుస సమావేశాలు అవుతున్నట్లు పార్టీ విశ్లేషకుల సమాచారం.
JP Nadda meeting in Nagar kurnool : రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అగ్ర నేతలకు బండి వివరించినట్లు తెలుస్తోంది. పార్టీలో నెలకొన్న స్తబ్దత, చేరికలపై చర్చించినట్లుగా సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థతి నుంచి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు అగ్ర నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ నెల 25న రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో జరిగే బహిరగ సభకు హాజరుకానున్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు కాగా.. తుపాన్ కారణంగా పర్యటన రద్దు అయింది. దీంతో సభను వాయిదా వేసుకున్నారు.
BJP Conduct Maha Jan Sampark Abhiyan Programme in TS : అమిత్ షాతో బహిరంగ సభను ఈ నెల చివరి వారంలో నిర్వహించే విషయంలో చర్చించేందుకు వెళ్లారని బీజేపీ నాయకులు తెలిపారు. దీంతో పాటు ప్రధాని మోదీ విదేశీ పర్యటన అనంతరం.. రాష్ట్రంలో పర్యటించే అంశంపై అగ్ర నేతలతో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహా జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమాలు, సభలు సమావేశాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి అయినందున ఈ నెల 22న ప్రతి నాయకుడు తమ నియోజక వర్గాల్లోని ప్రజలను కలవనున్నారు.
ఇంటింటికీ బీజేపీ : వారితో తమ పార్టీ చేసిన అభివృద్ధి పనులు గూర్చి వివరించనున్నారు. తెలంగాణలో సుమారు 35 లక్షల కుటుంబాలను ఒకే రోజు కలిసేందుకు బీజేపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కరపత్రాలను ఇంటింటికీ పంచనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ స్టిక్కర్లలను అంటించనున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తగిన వ్యూహాలను రచిస్తోంది. పార్టీలోని ప్రముఖ నాయకుల సమావేశాలు పెట్టేందుకు సుముఖత చూపుతోంది.
ఇవీ చదవండి :