నదీ జలాల వివాదం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు.... సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నీటిని ఏపీ తరలించే విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఎడారిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'సీఎం రిలీఫ్ ఫండ్ నిధులపై లెక్కలు చెప్పాలి'