Bandi Sanjay: మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని.. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన భాజపా ఓబీసీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తెరాసకు ఓబీసీలు వద్దని.. వారికి ఓటు బ్యాంకే ముద్దని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వమని తెలిసి కూడా ఇవ్వాలని కేసీఆర్ అడుగుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెరాసకు ఓటుబ్యాంకుతో పాటు అధికారం మాత్రమే కావాలని.. సమస్యల పరిష్కారం కాదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, తెరాసలు రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, తెరాస కలిసి పోటీ చేశాయి కానీ.. భాజపా, కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు. పేదల రహిత దేశం కావాలనేది మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం కేంద్రంలోని భాజపా సర్కారేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈబీసీ రిజర్వేషన్లు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.
కాంగ్రెస్, తెరాసలు రెండు ఒకటే..
అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. కానీ ఈ తెలంగాణలో ఆ రిజర్వేషన్లను అమలుచేయడం లేదు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వమని తెలిసి కూడా ఇవ్వాలని కేసీఆర్ అడుగుతున్నారు. ముఖ్యమంత్రికి కావాల్సింది ఓట్లు, సీట్లు. భాజపా మతతత్వ పార్టీ అని కేసీఆర్ అంటున్నడు.. కానీ మతపరమైన రిజర్వేషన్లు అడిగింది ఆయనే కదా. కాంగ్రెస్, తెరాసలు రెండు ఒకటే.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: