తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నదని, అడిగి తెచ్చుకుంది కాదని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని పింగళి వెంకట రామిరెడ్డి హాలులో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు రాలేదని రాజకీయాలకు అతీతంగా జరిగిన పోరాటమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ అవసరమని ఆయన అన్నారు. ప్రతి పొలానికి గోదావరి జలాలు అందాలని తెలిపారు. ఆత్మహత్యలు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :విషజ్వరాలు ఉన్నాయనేది వాస్తవం: మంత్రి ఈటల