ETV Bharat / state

'రాజకీయాల్లో అందరి మనిషి దత్తాత్రేయ' - himachal pradesh governor

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయను గౌరవించడమంటే బడుగు బలహీన వర్గాలను సన్మానించినట్లేనని పలువురు వక్తలు అన్నారు. ఇవాళ రవీంద్రభారతిలో దత్తాత్రేయకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు.

BANDARu _DATTATREYA
author img

By

Published : Sep 13, 2019, 8:00 PM IST

Updated : Sep 13, 2019, 9:39 PM IST

సామాజిక న్యాయం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని హిమాచల్​ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. బాల్యంలో తాను చదువుకోవటం వల్లే ఈ స్థాయికి ఎదిగానని ఆయన తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కూడా వీలైనప్పుడు తప్పకుండా హిమాచల్​ ప్రదేశ్​ సందర్శించాలని కోరారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దత్తాత్రేయకు పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రిగా ఉండి ప్రధాన మంత్రి దగ్గర బీసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్పనేత ​ దత్తాత్రేయ అని ఆర్​.కృష్ణయ్య అన్నారు. గవర్నర్​ హోదాలో ఉన్నప్పటికీ బీసీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దత్తాత్రేయకు గవర్నర్​ పదవి వచ్చిందంటే భాగ్యనగరం అంతా సంతోషించిందన్నారు ఆచార్య కోదండరాం. రాజకీయాల్లో శత్రువులులేని వ్యక్తి బండారు అని పేర్కొన్నారు.

సిద్ధాంతాలు వేరైనా...తమ లక్ష్యం సమాజ శ్రేయస్సే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి తెలిపారు. ఆనాడు మహారాష్ట్ర గవర్నర్​గా నియమించబడ్డ విద్యాసాగర్​కు రాష్ట్ర ప్రభుత్వమే సన్మాన కార్యక్రమం నిర్వహించి...ఈరోజు దత్తాత్రేయను గౌరవించకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. నీతి, నిజాయతీలకు నిలువుటద్దం గవర్నర్​ దత్తాత్రేయ అని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ కొనియాడారు. కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

'రాజకీయాల్లో శత్రువులులేని వ్యక్తి బండారు '

ఇవీ చూడండి:ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!

Last Updated : Sep 13, 2019, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.