సమయం కోసం చూసి..
నాగసాయి మరో బ్యాండ్ బృందాన్ని తయారు చేయడం ఇష్టం లేని.. తోటి సభ్యులు నాగసాయిపై పగ పెంచుకున్నారు. ఎప్పుడు దొరుకుతాడా..? అని మిగతా సభ్యులు ఎదురు చూశారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నాగసాయి ఇంటి వద్దకు వెళ్లి.. ద్విచక్రవాహనంపై లోతుకుంటలోని వారి పాత బ్యాండ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు అతడితో మాట్లాడారు. ఈ క్రమంలోనే.. మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇష్టమొచ్చినట్టు..
అప్పటివరకు కోపంతో ఉన్న తోటి సభ్యులు.. అదే అదునుగా భావించి ఒక్కసారిగా నాగసాయిపై మూకుమ్మడి దాడి చేశారు. కాళ్లతో తన్నడం, పిడిగుద్దులతో విచక్షణారహితంగా కొట్టారు. నాగసాయి బట్టలు విప్పేసి.. శరీరంపై డీజిల్ పోసి ఆటూఇటూ లాగుతూ కొట్టారు. విషయం తెలుసుకున్న నాగసాయి కుటుంబ సభ్యులు.. అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. దాడి చేసిన బృంద సభ్యులందరిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
ఇదీ చూడండి: