ETV Bharat / state

"భళా"పూర్... రూ.450తో మొదలై 17.60 లక్షలకు లడ్డూవేలం - winner

బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటకు పాతికేళ్లుగా ప్రత్యేకత ఉంది. గతేడాది 16 లక్షల 60 వేల రూపాయలు పలికిన ధర... ఈసారి 17లక్షల 60 వేల రూపాయలకు చేరింది. కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నాడు. బాలాపూర్​ లడ్డుకోసం స్థానికులతో పాటు రైతులు, వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు ఈ వేలం పాటలో పోటీపడ్డారు.

balapur ganesh
author img

By

Published : Sep 12, 2019, 1:26 PM IST

Updated : Sep 12, 2019, 2:18 PM IST

బాలాపూర్​ లడ్డూ ధర@17.60 లక్షలు

ఎంతో పేరున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి రికార్డు స్థాయిలో 17 లక్షల 60 వేల రూపాయల ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు 'కొలను' కుటుంబ సభ్యులే బాలాపూర్ గణేశుడి లడ్డూని సొంతం చేసుకున్నారు. వేలంపాట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. బంగారు పూతతో ఉన్న వెండి పళ్లెంలోని 21 కిలోల పరిమాణం ఉన్న లడ్డూను రాంరెడ్డికి అందజేశారు.

బాలాపూర్ లడ్డూ గతేడాది 16 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఈ ఏడాది వేలంపాట కోసం 19 మంది పోటీపడ్డారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి నెల్లూరు వాసి గుండాల వంశీకృష్ణారెడ్డి కూడా వేలంలో పాల్గొనడం విశేషం. పోటీపోటీగా సాగిన పాటలో గతేడాది కంటే లక్ష రూపాయల ధర ఎక్కువకు వేలం ఖరారైంది.

1994లో మొదలై..

గ్రామాభివృద్ధి కోసం మొదలు పెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ గ్రామ రూపురేఖలను మార్చేసింది. మొదట 1994లో 450 రూపాయలతో వేలం పాట ప్రారంభమైంది. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను అందుకున్నారు. గతేడాది స్థానికేతరుడైన తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయికి చేరింది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతోపాటు వ్యాపారం బాగా కలిసి వస్తుండటం వల్ల ప్రతిఏటా తీవ్రమైన పోటీ నెలకొంటోంది.

ఇవీ చూడండి:ట్యాంక్​బండ్​కు చేరువలో ఖైరతాబాద్ మహాగణపతి

Last Updated : Sep 12, 2019, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.