సికింద్రాబాద్ బాలానగర్‌లో 35 ఏళ్ల నుంచి నర్సింగ్ రావు అనే వ్యక్తి... గౌడ కులస్థులకు చెందిన కల్లు దుకాణాన్ని నడుపుతున్నాడని... బాలానగర్ గౌడ సంఘం నాయకులు తెలిపారు. వెయ్యికి పైగా కుటుంబాలకు చెందిన దుకాణం స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆయన చేస్తున్న దోపిడిని నిరసిస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ ముందు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆయనను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడతానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. టీసీఎస్‌లో బాలానగర్ గౌడ సంఘానికి చెందిన వారిని సభ్యులుగా గుర్తించడం లేదని అన్నారు. కేవలం ఆయన కుటుంబానికి చెందిన 12 మంది పేర్లతో సొసైటీ తయారు చేసుకున్నాడని చెప్పారు. ఆ సొసైటీని రద్దు చేసి, ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అబ్కారీ శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు- 30 మంది మృతి