బాలసాయిబాబా 60వ పుట్టినరోజు ఉత్సవాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దోమలగూడలోని బాలసాయి బాబా ఆశ్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారు కార్తిక్ రెడ్డి కలిసి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ట్రస్ట్‌లో కార్యక్రమాలు బాబా చెప్పినట్లే 'మానవ సేవే మాధవ సేవ' అనే భావనతో కొనసాగిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ రామారావు తెలిపారు. సేవ ద్వారా దేవున్ని సంతృప్తి పరచగలమంటూ బాబా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.
అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకపోయినా.. సేవ చేసే మనసు అందరికీ అలవాటుగా మారాలని రామారావు అన్నారు.
ఇదీ చదవండి: నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ