ETV Bharat / state

డర్టీ హారీ సినిమా పోస్టర్లు దగ్ధం చేసిన భజరంగ్ దళ్ - తెలంగణ వార్తలు

ఇటీవల విడుదలైన డర్టీ హారీ సినిమా పోస్టర్లను భజరంగ్ దళ్ కార్యకర్తలు చింపివేశారు. అశ్లీలంగా ఉన్నాయని ఆరోపిస్తు వాటిని తగులబెట్టారు. ఇటువంటి సినిమాలు ఎక్కడ విడుదలైనా అడ్డుకుంటామని హెచ్చరించారు.

Bajrang Dal burns Dirty Harry movie posters
డర్టీ హారీ సినిమా పోస్టర్లు దగ్ధం చేసిన భజరంగ్ దళ్
author img

By

Published : Dec 25, 2020, 7:55 PM IST

డర్టీ హారీ సినిమా పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయని భజరంగ్ దళ్ కార్యకర్తలు వాటిని చింపివేశారు. ఆ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లోని కూకట్‌పల్లి బస్టాప్ వద్ద మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన సినిమా పోస్టర్లను చింపి తగులబెట్టారు.

భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాలకు హాని కలిగించే డర్టీ హరి లాంటి సినిమాలకు తాము వ్యతిరేకమని భజరంగ్ దళ్ నాయకుడు జీవన్ అన్నారు. ఎటువంటి సెన్సార్ లేకుండా సినిమాలు విడుదల చేస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇటువంటి సినిమాలు ఎక్కడ విడుదలైనా అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పెరుగుతోన్న చలి తీవ్రత.. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.