తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని భజరంగదళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాశ్ చందర్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయక విగ్రహానికి తెరాస కండువాను ఎమ్మెల్సీ కవిత, ముఠా గోపాల్ కప్పించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని... పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ స్టేషన్‌కు తరలించారు.
తమ ఆరాధ్య దైవం వినాయకుని విగ్రహంపై పార్టీ కండువా కప్పడం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. సామాన్యులకు ఒక చట్టం, అధికార పార్టీ నేతలకు ఒక చట్టమా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో భాజపా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది : అసద్