ETV Bharat / state

ముంబయిలో టిస్‌ సలహా మండలి సభ్యుడిగా వినోద్‌ - vinodkumar appointed member of Tata Institute of Social Science

తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ముంబయిలోని టాటా సామాజిక శాస్త్ర అధ్యయనాల సంస్థ సలహా మండలి సభ్యులుగా ఎంపికయ్యారు. ఆయనను ఎంపిక చేసినట్లు హైదరాబాద్‌ ప్రాంగణ డైరెక్టర్‌ షాలిని భరత్ పేర్కొన్నారు.

B Vinod Kumar has been appointed member of the TISS advisory council
ముంబయిలో టిస్‌ సలహా మండలి సభ్యుడిగా వినోద్‌
author img

By

Published : Sep 30, 2020, 8:00 AM IST

ముంబయిలోని టాటా సామాజిక శాస్త్ర అధ్యయనాల సంస్థ (టిస్‌) సలహా మండలి సభ్యులుగా తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. 1964 సంవత్సరంలో టిస్​ను గ్రేడ్ వన్ డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. యూజీసీ నిధులతో టిస్ నిర్వహణ సాగుతోంది.

సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా అవగాహన, న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుని పాలకమండలి తరుపున టిస్‌ ఛైర్మన్‌ ఎస్‌.రామదురై ఆయనను ఎంపిక చేసినట్లు హైదరాబాద్‌ ప్రాంగణ డైరెక్టర్‌ షాలిని భరత్‌ ప్రకటించారు.

పీవీ ఉత్సవాల కమిటీ ప్రత్యేకాధికారి

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీలో ప్రత్యేకాధికారిగా తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి : ఖైదీల విడుదలకు రంగం సిద్ధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.