ETV Bharat / state

అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు - Doors of Ayodhya Ram Temple in Hyderabad

Ayodhya Ram Mandir Opening 2024 : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయానికి వాడే తలుపులను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. జనవరి 22న ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 2:18 PM IST

Updated : Dec 25, 2023, 2:30 PM IST

అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు

Ayodhya Ram Mandir Opening 2024 : అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్‌ కంపెనీ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.

Ayodhya Temple Doors Making in Hyderabad : అయోధ్య రామమందిరం కోసం వినియోగించనున్న తలుపులను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌లో వీటిని రూపొందిస్తున్నారు. ఇందుకోసం నిపుణులైన కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చూడముచ్చటైన శిల్పాలతో చెక్కిన తలుపులను రూపొందిస్తున్నారు.

అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్​తో నెక్లెస్​- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!

అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కు పైగా తలుపులను తాము తయారు చేస్తున్నామని సంస్థ యజమాని శరత్‌బాబు తెలిపారు. బల్లార్షా నుంచి తెచ్చిన టేకునే వాడుతున్నామన్నారు. అందులో కూడా అధిక నాణ్యత కలిగిన కలపను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడటంతో పనిలో వేగం పెంచామని చెప్పారు. ఈ అవకాశం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని యజమాని శరత్ బాబు పేర్కొన్నారు.

బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్​ సూపర్​!

"అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన తలుపులు తయారు చేస్తున్నాం. బల్లార్షా నుంచి టేకు కలపను వాడుతున్నాం. మేము చాలా అధిక నాణ్యత కలపను ఉపయోగిస్తున్నాము. ఉదాహరణకు, 100 కలప ముక్కల్లో, 20 అధిక నాణ్యత కలప ముక్కలను ఎంచుకుంటాము. నిపుణులైన కళాకారులు వీటిని తయారు చేస్తున్నారు. త్వరలోనే వాటిని ఆలయ అధికారులకు అందిస్తాం." - శరత్‌బాబు, అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ యజమాని

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం : ఈ శిల్ప కళ చాలా బాగుందని స్థానికులు అంటున్నారు. అయోధ్య రామమందిరం కోసం తలుపులు ఇక్కడ తయారు కావడం తమకు గర్వంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు వివరించారు. 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని తెలిపారు. ఆ సమయంలో ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని పేర్కొన్నారు. ఈ రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు.

"ఈ శిల్ప కళ చాలా బాగుంది. మా పిల్లలకు వీటి డిజైన్లను వివరించాను. వారు కూడా ఈ కళను చూసి ఆనందం పడుతున్నారు. మా ప్రాంతంలో చెక్కిన తలుపులు అయోధ్య రామమందిరంలో వాడుతునందుకు మాకు గర్వంగా ఉంది." - రాఘవేంద్ర, స్థానికుడు

'అయోధ్య ప్రాణప్రతిష్ఠకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం- ఆ గడియల్లో పూర్తిచేస్తే తిరుగుండదు'

అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు- ఎక్కడో తెలుసా?

Last Updated : Dec 25, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.