ETV Bharat / state

AWARENESS ON DRUGS: పంజాబ్​లా హైదరాబాద్ మారొద్దనే డ్రగ్స్​పై పోరు: సీవీ ఆనంద్ - మాదకద్రవ్యాల నిర్మూలన తాజా వార్తలు

AWARENESS ON DRUGS: డ్రగ్స్​ వల్లే పంజాబ్‌లో పరిస్థితి అదుపు తప్పిందని అలాంటి స్థితి హైదరాబాద్​లో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. బాగ్​లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన మాదకద్రవ్యాల నిర్మూలన సదస్సు, ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

AWARENESS DRUGS RALLY HYDERABAD
హైదరాబాద్​ లో మాదకద్రవ్యాల నిర్మూలన పై ర్యాలీ
author img

By

Published : Feb 15, 2022, 11:49 AM IST

AWARENESS ON DRUGS: రాబోయే 15 సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగం, డ్రగ్స్ వంటి రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బాగ్​లింగంపల్లిలోని ఆర్టీసి కళ్యాణ మండపంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు వాటి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల ప్రస్తుతం పంజాబ్​లో పరిస్థితి అదుపు తప్పిందని అలాంటి స్థితి హైదరాబాద్​లో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలియచేశారు. ఇలా చేయడం వల్ల వారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్నారు. వీటిని పూర్తిగా నియంత్రించేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.

సంపన్నుల పిల్లలూ ఎక్కువగా డ్రగ్స్​కు బానిసలుగా మారతున్నారని.. ఇటీవల టోని కేసులో అరెస్ట్ అయిన వారే అందుకు నిదర్శనం అన్నారు. ఇప్పటి వరకూ బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశామని వారిలో మార్పు రావడం లేదు కనుక అరెస్ట్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులతో కలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి: Telangana Joined in VAHAN : వాహన్​లో చేరిన తెలంగాణ రవాణా శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.