హైదరాబాద్ తార్నాకలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆడిటోరియంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐజీ స్వాతి లక్రా, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అదనపు డీసీపీ సలీమా, ఐసీసీ సభ్యులు పాల్గొన్నారు.
పని చేసే చోట మహిళపై జరిగే లైంగిక వేధింపుల నివారణ పట్ల ప్రతి మహిళకు అవగాహన అవసరమన్నారు షీ టీమ్స్ ఐజీ స్వాతి. మహిళ భద్రత కోసం షీ టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలు పని చేసే చోట ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మహిళలు పని చేసే కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మహిళలకు భద్రత కల్పించడానికి షీటీమ్స్ తీసుకొచ్చామని.. ప్రతి ఒక్కరు షీ టీమ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఇదీ చదవండి: 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం