ప్రజల ఆరోగ్య అవసరాలకు తగినంత మంది వైద్యుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఐఎస్‌ఎమ్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అమీర్‌పేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నార్త్ అమెరికా, కజకిస్థాన్‌కు చెందిన యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని.. అక్కడి విద్యావకాశాలు, సదుపాయాల గురించి విద్యార్థులకు వివరించారు.
'సామాన్యులకు వైద్య విద్య అందని ద్రాక్షగానే మారింది'
వైద్య విద్య సామాన్యులకు అందని ద్రాక్షలాగా మారిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో నిర్వహించిన వైద్యవిద్యలో ఎదురవుతున్న సవాళ్లపై తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.