Avatars of Lord Shiva: శివుని ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదు అంటారు. అంతటి గొప్ప విశిష్టత ఉన్నబోళాశంకరుని అవతారాలు ఎన్నో.. ఒక్కో సందర్భంలో ఒక్కో అవతారంలో కనిపిస్తుంటారు. సమస్య పరిష్కరానికి, లోక కల్యాణం కోసం నటరాజు మారే రూపాల్లో కొన్నింటి గురించి గుర్తుచేసుకుందాం.
సృష్టి రూపాలు: ఈ లోకంలో ప్రతి జీవి సృష్టి కర్త బ్రహ్మదేవుడని అందరూ అంటారు. అయితే ఆ బ్రహ్మదేవునికి ఆ పనిని అప్పగించింది శివుడే అని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మహావిష్ణువు నిరంతరం మహాదేవుడ్ని ధ్యానిస్తారని కూడా కొన్ని ఆగమాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన సృష్టి కర్తగా వ్యవహరిస్తూ ఆయన కనిపించే అవతారులే సృష్టి రూపాలు.
సంహార రూపాలు: అందరికి తెలిసిన విషయం ఏమిటంటే శివుడు తన భక్తులు వరాలు ఇస్తారని.. అదే విధంగా తమపై భక్తితో ఉంటే వరాలు ఇస్తాడు. అలానే లోకానికి వినాశనానికి పాల్పడితే వారిని సంహారిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పరమేశ్వరుడు ధరించిన అవతారాలే సంహార రూపాలు.
అనుగ్రహ అవతారాలు: పురాణాలను, అనేక గ్రంథాలు ఆధారంగా శివ భక్తులకు వారి చేసే తపస్సులో ఆశయం, లక్ష్యం.. వంటివి ఉంటే వీలైనంత త్వరగా దర్శనమిస్తారు. వారు కోరిన కోర్కెలు తీరుస్తారు. ఈ విధంగానే మునులు, రాక్షసులు.. ఆయన అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో భక్తులపై అనుగ్రహించి ఈ రూపంలో కనిపిస్తారు.
తిరోధాన అవతారాలు: ప్రకృతిలో ఏది పుట్టిన తిరిగి అందులోనే కనమరుగు అవుతుంది. సృష్టిలోని జీవుల మధ్య ఉండే చైతన్యాన్ని అంచెలంచెలుగా వెనక్కి తీసుకోడాన్ని తిరోధానం అంటారు. శివుని ద్వారా పుట్టిన సమస్త లోకం, ఆ లోకంలో ప్రతి ప్రాణికి అవసరమైన శక్తిని మహేశ్వరుడు తనలో ఐక్యం చేసుకొనేటప్పుడు ఈ అవతారాలను ధరిస్తారు.
మరి కొన్ని అవతారాలు ...
- అర్ధనారీశ్వరమూర్తి, దక్షిణామూర్తి, కాలసంహారమూర్తి, వీరభద్రమూర్తి
- శరభమూర్తి, చంద్రశేఖరమూర్తి, నటరాజమూర్తి, చక్రప్రదానమూర్తి
- లింగమూర్తి, భిక్షాటనమూర్తి, జలంధరమూర్తి, హరిహరమూర్తి
- చండేశానుగ్రహ మూర్తి, సోమాస్కంద మూర్తి, మన్మథ సంహార మూర్తి, వీరభద్ర మూర్తి
- కిరాతమూర్తి, వృషారూఢమూర్తి, నటరాజమూర్తి, త్రిపుర సంహార మూర్తి, లింగోద్భవ మూర్తి
- విఘ్నప్రసాదమూర్తి, గజసంహారమూర్తి, కల్యాణ సుందర మూర్తి, కంకాలధారణ మూర్తి
- శరభ మూర్తి కిరాత మూర్తి, ఏకపాద మూర్తి ఇలా ఎన్నో అవతారాలు శివునికి సొంతం.
ఇవీ చదవండి: