పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తానని చెప్పి... ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందారెడ్డి విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలను జీఎస్టీలోకి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ... వనస్థలిపురం ఆటోనగర్లో విజయవాడ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ప్రభుత్వలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.... రహదారిపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది.
కరోనాతో దేశంలో లారీల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నందారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు లేకుండా పెంచుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: జిలుగు సాగును సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్