ETV Bharat / state

'ఆటోలు నడుపుకుంటూ బతుకుతున్నం.. ఇప్పుడు రానివ్వకుంటే ఎలా బతకాలి' - ఆటోడ్రైవర్ల ధర్నా

Auto Drivers Protest: ఇతర జిల్లాలకు చెందిన కొందరు ఆటో యజమానులు తమ ఆటోలను నగరంలోకి అనుమతించాలని సాగర్​ రింగ్​ రోడ్డు సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. గత మూడేళ్లుగా కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. గ్రామాల్లో పని లేకపోవడంతో కొన్నేళ్లుగా నగరంలోనే ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నామని.. ఇప్పుడు పోలీసుల నిర్ణయంతో తమ బతుకుల ఆగమవుతాయని ఆటో యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆటోలు నడుపుకుంటూ బతుకుతున్నం.. ఇప్పుడు రానివ్వకుంటే ఎలా బతకాలి'

author img

By

Published : Feb 26, 2022, 12:39 PM IST

Auto Drivers Protest: నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కొంతమంది తమ ఆటోలను నగరంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ సాగర్​ రింగ్​ రోడ్డు సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామాల్లో పని లేకపోవడంతో కొన్నేళ్లుగా నగరంలోనే ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఆటోలను నగరంలో తిరగకూడదని ఆదేశాలు జారీ చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. తమ పర్మినెంట్ చిరునామా గ్రామాల్లో ఉండటంతో అక్కడి అడ్రస్ మీదనే ఆటోలు కొనుగోలు చేసి, ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని వారు వెల్లడించారు.

తమ ఆటోలకు నగరంలో అనుమతి లేనప్పుడు అధికారులు మీటర్ రీడింగ్ సీజింగ్​తో పాటు సీరియల్ నెంబర్ ఇచ్చి స్టిక్కర్లు ఎందుకు అతికించారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల వాహనాలు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు నగరానికి ఆనుకోని ఉన్న జిల్లాల నుంచి వచ్చే ఆటోలను అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇతర జిల్లాల ఆటోలకు అనుమతి ఉండదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని తమ ఆటోలను నగరంలో తిరగనివ్వాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

బతుకుదెరువు ఎలా..

గత నాలుగు రోజుల నుంచి పోలీసులు ఆటోలను అనుమతి ఇవ్వటం లేదు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాహనాలను నగరంలోకి అనుమతి ఇవ్వడం లేదు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి ఆటోలు నడుపుకుంటున్నాం. -రాంబాబు, ఆటో యజమాని

ఐదారు ఏళ్ల నుంచి నడుపుతున్నాం..

చాలా ఏళ్ల నుంచి ఇక్కడే బతుకుతున్నాం. హైదరాబాద్​లో బండి కొనాలంటే రూ.4లక్షలు పెట్టాలి. అంత పెట్టలేక జిల్లాల్లో బండ్లు కొని నడుపుకుంటున్నాం. దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి ఇవే వాహనాలు నడుపుకుంటున్నాం. ఇప్పుడు బయటకు వెళ్తే పోలీసులు పట్టుకుంటున్నారు. మేము ఎలా బతకాలి. - వెంకట్, ఆటో యజమాని

'ఆటోలు నడుపుకుంటూ బతుకుతున్నం.. ఇప్పుడు రానివ్వకుంటే ఎలా బతకాలి'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.