హైదరాబాద్ చాదర్ఘాట్లో ఓ ఆటో బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఆటోడ్రైవర్ అతివేగంతో.. అజాగ్రత్తగా వాహనం నడపటం వల్ల చాదర్ఘాట్లోని మూసీనది బ్రిడ్జిపై అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీవ్ర గాయాలపాలై.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఆటోడ్రైవర్ ఆటోను వదిలి పరారయ్యాడు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పదో తరగతి విద్యార్థిపై 8 మంది దాడి