ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న వేళ... రోగనిరోధక శక్తిపై అందరికీ ఆసక్తి పెరిగింది. సాధారణ ప్రజలు సైతం తమకు తెలిసిన అనేక రకాల వంటింటి చిట్కాలతో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం తింటే శరీరంలో ఇమ్యునిటీ వృద్ధి చెందుతుందన్న దానిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. హిమాలయాల్లో పెరిగే ఓ రకం పుట్టగొడుగులకు కరోనా వైరస్ వృద్ధిని అడ్డుకునే సామర్థ్యం ఉందని ఓ స్టార్టప్ కంపెనీ గుర్తించింది.
వైరస్ను ఎదుర్కొవడానికి ఆ పుట్టగొడుగు ఉపయోగపడుతుందని సీసీఎంబీ అనుబంధంగా ఉన్న అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంలోని ఓ సంస్థ గుర్తించింది. దీని గురించి మరిన్ని వివరాలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ మధుసూదన్ మాటల్లో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: 'కరోనా వల్ల తీవ్ర పేదరికంలోకి 17 కోట్ల మంది'