భాగ్యనగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి విక్రయాలపై ఈటీవీ భారత్- ఈనాడులో వచ్చిన కథనాలపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పందించారు. గోల్కొండ, ఆసిఫ్ నగర్, హుమాయూన్ నగర్, మంగళ్ హాట్, కుల్సుంపుర, హబీబ్ నగర్ పోలీస్ ఠాణా పరిధుల్లో గంజాయి విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈటీవీ-ఈనాడులో కథనంతో గంజాయి స్మగ్లర్లు అప్రమత్తమై పారిపోయారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. గంజాయి విక్రయిస్తూ ప్రస్తుతం జైళ్లో ఉన్న లక్ష్మయ్య, నక్కా శ్రీను, దినేష్, రాజుసింగ్లపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. పీడీ చట్టానికి సంబంధించిన పత్రాలు చంచల్ గూడ జైలు అధికారులకు అందించారు. వీళ్లు ఏడాదిపాటు జైల్లోనే ఉండనున్నారు.
ఇదీ చూడండి: బీహెచ్ఈఎల్లో గంజాయి పట్టివేత