హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం కాంప్లెక్స్ వద్ద లక్కిరెడ్డి తిరుపతి రెడ్డిని ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. సమాచారం అందుకున్నఎస్‌ఆర్ నగర్ పోలీసులు బాధితుడిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ ఫార్మా కంపెనీలో ఇద్దరు భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీలే గొడవకు దారి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వెంకట్ రెడ్డి, వశీష్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తన ఫార్మా కంపెనీ విషయంలో కొందరు అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితుడు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
ఇదీ చూడండి : ద్విచక్రవాహనం అదుపుతప్పి సర్పంచ్ మృతి