రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని అల్కాపురి టౌన్‌షిప్ వాసులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. రహదారిపై మానవహారం నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రెండుమూడు నెలల్లోనే నీరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు నీరు ఇవ్వమంటే ఈ గుట్టల్లో ఇళ్లెవరు కొనమన్నారని అడగడం తమను కలచివేసిందని వాపోయారు. ఒక్కో ట్యాంకర్‌కు సుమారు 1500 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు ట్యాంకర్ నీటితో అనారోగ్యానికి గురవుతున్నట్లు వాపోయారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : దిగొచ్చిన మెట్రో... మౌనిక కుటుంబానికి రూ.20లక్షలు, ఒకరికి ఉద్యోగం