సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వం రద్దు కేసులో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్రావులు సోమవారం హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ నెల 15న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించి న్యాయశాఖ కార్యదర్శికి ఎలాంటి సంబందం లేకపోయినా సింగిల్ జడ్జి కోర్టు ధిక్కరణ కింద తీసుకున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కేసులో పూర్తి విచారణను పరిగణనలోకి తీసుకోకుండా తమపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని అన్నారు. న్యాయాధికారి హోదాలో ఉన్న తమకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు నష్టం కలిగించాయని పేర్కొన్నారు.
విచారణ నిలిపేయండి
ఈ తీర్పు వ్యవస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని అన్నారు. న్యాయమూర్తి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కోర్టు ధిక్కరణ కేసులో విచారణను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది.