ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ
ద్రవ్యవినిమయ బిల్లుపై ప్రతిపక్షనేత మల్లు భట్టివిక్రమార్క చర్చ ప్రారంభించారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిధుల వినియోగం, ఖర్చు, అప్పులు తదితర అంశాలకు సంబంధించి అభ్యంతరాలు, అభిప్రాయాలను వివరించారు.
విమర్శలను తిప్పికొట్టిన సీఎం
విపక్షనేత భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలకు తనదైన శైలిలో ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ శాఖను తన వద్ద ఉంచుకోవడానికి గల కారణాలు, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వంటి విషయాలపై ప్రస్తావించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ఎందుకు ప్రవేశపెట్టామో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
నిరవధిక వాయిదా
ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. మూడు రోజుల పాటు సమావేశమైన సభ పది గంటలా నాలుగు నిమిషాల పాటు సాగింది. నాలుగు బిల్లులు సభ ఆమోదం పొందాయి.
ఇవీ చదవండి:అసెంబ్లీ నిరవధిక వాయిదా