తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్రంలో స్టేడియాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దృఢంగా ఉంటారని చెప్పారు.
చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆన్లైన్ ద్వారా క్రీడలు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తొలి ఏసియన్ ఆన్లైన్ ఈ-కటా ఛాంపియన్షిప్2020 ఇంటర్నేషనల్ కుంగ్ ఫు టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు గౌడ్, ఉపాధ్యక్షుడు వేములయ్య గౌడ్, కుంగ్ ఫు మాస్టర్స్ మురళి, కృష్ణం రాజు, కన్నన్ గౌడ్, దేవేందర్‌లు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్