Asha workers Darna in Hyderabad: రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి మూల స్తంభంగా నిలిచిన ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వీడని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పి.విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఆశా వర్కర్లకు శాశ్వత వేతనం నిర్ణయించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో వారు ఆందోళన నిర్వహించారు.
రాష్ట్రంలో పేద ప్రజలకు 18 ఏళ్లుగా ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనుభవం లేని ఆశాలకు కనీసం రూ.10,000 చేయాలని కోరారు. కంటి వెలుగు పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించారు.
ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న శాశ్వత వేతనం మాదిరిగానే తెలంగాణలో కూడా ఇవ్వాలని ఆశా కార్మికురాలు రేవతి కళ్యాణి కోరారు. ఆశా కార్మికులు గర్భిణీలకు అందిస్తున్న సేవలకుగాను ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదని కనీస వేతనం ఇచ్చేవరకు పారితోషకాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
"ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టు తెలంగాణలో కూడా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని , కొవిడ్ రిస్క్ అలవెన్స్, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతున్నాం. ఆశాలకు పనిభారం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జాబ్ చార్ట్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం. మాకు ఈఎస్ఐ సౌకర్యం కలిపించాలని వీటితో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నాం. మా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అలా చేయని పక్షంలో ఈ పోరాటం పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తున్నాం." -పి.జయలక్ష్మి, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
ఇవీ చదవండి: