హైదరాబాద్లో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీల్లో జిహాదీలు పని చేస్తున్నారా?.. మీరు తనిఖీలు చేశారా? అంటూ ఓ వ్యక్తి సైబరాబాద్ పోలీసులను ప్రశ్నించాడు. దీనికి సీపీ సజ్జనార్ సమాధానమిస్తూ అలాంటి వారు ఉంటే గుర్తించేందుకు రక్షణశాఖలోని ఓ విభాగం 24 గంటలూ పనిచేస్తుందని తెలిపారు.
దీనిపై స్పందిచిన ఎంపీ అసదుద్దీన్... అలాంటి వారు ఉంటే అరెస్ట్ చేయండి కాని తెల్లవారు జామున ఎన్కౌంటర్ పేరుతో చంపేయకండి అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ అలా ఎంత మందిని గుర్తించారో సీపీ చెప్పాలని అసదుద్దీన్ కోరారు. ట్విట్టర్లో అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చూడండి: దృశ్యం ఇక అపూర్వం- 8కే తెరతో అదిరే టీవీలు