Asaduddin Owaisi Interesting Comments: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తాజ్‌మహల్ మాదిరిగా సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా ఇష్టాగోష్ఠిలో అసదుద్దీన్ పలు అంశాలపై మాట్లాడారు.
కొత్త సచివాలయంలో మసీదును నిర్మించాలని ప్రభుత్వాన్ని అడిగామని.. ఇందులో భాగంగానే మసీదు కడుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని.. దేశమంతా వస్తే మంచిదేనని వివరించారు. ఎంఐఎంను బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అసదుద్దీన్ దుయ్యబట్టారు.
బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోదీ అంగీకరించడం లేదన్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం అని.. ఇందుకు హాజరవుతామని చెప్పారు. పరేడ్‌గ్రౌండ్‌లో బీఆర్ఎస్ సభ.. రాజకీయ సభ అని.. తమకు సంబంధం లేదని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: సచివాలయ ప్రారంభోత్సవం వేళ భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
'ఎన్నికైన ప్రభుత్వాలను 90సార్లు కూల్చారు.. NTR విషయంలోనూ అంతే'