ETV Bharat / state

దానికోసమే హైదరాబాద్‌లో అల్లర్లకు భాజపా కుట్రలన్న అసదుద్దీన్‌ - మోదీకి అసదుద్దీన్ ప్రశ్నలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌పై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. రాజాసింగ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యాలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

ASAD
హైదరాబాద్‌పై ఎందుకు కన్నేశారు, మోదీకి అసద్ ప్రశ్న
author img

By

Published : Aug 23, 2022, 5:23 PM IST

ఒక ఉపఎన్నిక కోసం భాజపా తెలంగాణలో ఎందుకు అగ్గిరాజేస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్‌.... హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

''ఈ వ్యాఖ్యలను ఖండిస్తారా? లేదా? అని ప్రధాని, భాజపాను ప్రశ్నిస్తున్నాం. ఇది మీకు ఒక అధికార విధానంగా మారిందా? నుపూర్‌ శర్మ నుంచి మొదలు మీ ఎమ్మెల్యేల వరకు ఎందుకు ఇలా సమస్యలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌పై ఎందుకు కన్నేశారు. తెలంగాణను ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారు. కేసీఆర్‌తోనో, మాతోనో పోరాడాలనుకుంటే పోరాటం చేయండి. మేము సిద్ధమే. రాజకీయపరంగా వెనుకడుగు వేసేదే లేదు. కానీ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తూ ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఒక్క ఉపఎన్నిక కోసం తెలంగాణలో అగ్గిరాజేస్తున్నారు. హైదరాబాద్‌ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటున్నారు. 8ఏళ్లలో చిన్నచిన్న ఘటనలు మినహా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఏం చేయాలనుకుంటున్నారు. దేశానికి, ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు.''- అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంఐఎం అధినేత

దానికోసమే హైదరాబాద్‌లో అల్లర్లకు భాజపా కుట్రలన్న అసదుద్దీన్‌

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.