జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎం ప్రచార జోరు కొనసాగుతోంది. స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగిన ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. రెడ్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించారు.
పతంగి గుర్తుకే ఓటు వేసి గెలిపించి, మరోసారి ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితులందరికీ సాయమందేలా చేయడంతో పాటు డివిజన్లలో అభివృద్ధికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: బల్దియా బరిలో.. ఓటు ఓటుకూ.. చేతులు మారే నోటు!