ETV Bharat / state

తగ్గినట్లే తగ్గింది.. ఉన్నట్లుండి హెచ్చింది! - హైదరాబాద్​ కొవిడ్​-19 సమాచారం

గ్రేటర్‌ హైదరాబాద్​లో వారం రోజులుగా కరోనా విజృంభిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే దాదాపు 330 మంది పాజిటివ్‌గా తేలారు. వెరసి బాధితుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. మొత్తం మృతుల్లోనూ గ్రేటర్‌ నుంచే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎందుకు కేసులు పెరుగుతున్నాయనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

telangana corona news
telangana corona news
author img

By

Published : May 16, 2020, 6:55 AM IST

భాగ్యనగరంలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదైన జియాగూడ, కుల్సుంపురా, కార్వాన్‌ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ప్రతి అనుమానితుడి స్వాబ్‌ శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నారు. ఆసుపత్రులకు, హోల్‌సేల్‌ మార్కెట్‌లకు వెళ్లి వచ్చినవారిలో తొలుత లక్షణాలు బయట పడుతున్నాయి. మలక్‌పేట్‌ గంజ్‌తో సంబంధం ఉన్న పలువురిలో కరోనా వైరస్‌ వెలుగుచూసింది.

కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి జాగ్రత్తలు తీసుకొని కేసులు తగ్గాక జోన్‌లు ఎత్తేశారు. ఆ తర్వాతా అక్కడ కొత్త కేసులు బయట పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌బీనగర్‌, కార్వాన్‌ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. దీంతో చర్యలు మరింత తీవ్రం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఆ రెండు ప్రాంతాల్లో దడ...

వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో పశ్చిమ మండలంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. మొత్తం 285 కేసులు నమోదయ్యాయి. కుల్సుంపురా పోలీస్‌ ఠాణా పరిధిలోని జియాగూడ, మంగళ్‌హాట్‌లోని గోడేకీ కబర్‌ ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా మారాయి. జియాగూడ ప్రాంతంలో 4 రోజుల వ్యవధిలో 42 కేసులు నమోదయ్యాయి.

ఒక్క స్నానపు గది.. 15 కేసులు...

మంగళ్‌హాట్‌లోని కామాటిపుర బస్తీలో ఈనెల 11న ఓ వ్యక్తికి(45) కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతను నివసిస్తున్న ఇంట్లో మరో నాలుగు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. వీరందరికీ ఒకటే స్నానపుగది(బాత్‌రూమ్‌) ఉంది. ఆయా కుటుంబాల్లోని 15 మందికి కరోనా వ్యాపించడానికి ఈ స్నానపు గదే కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఇంట్లో వృద్ధులుంటే జాగ్రత్త...

ముఖ్యంగా వృద్ధులపై కరోనా పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందులో 40 నుంచి 89 మధ్య వయస్కులవారే 32 మంది ఉన్నారు. వీరిలో నగరానికి చెందిన వారే 90 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా కరోనా సోకినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వీరు ఇటు అటు తిరుగుతూ వాహకాలుగా మారుతుంటారు. వీరి ద్వారానే ఇంట్లో పెద్దలకు సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తత, జాగ్రత్తలతోనే మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

గుర్తించకనే గుప్పుమంటోందా..?

కరోనా వైరస్‌ సోకిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడంలోనే సమస్య వస్తున్నట్లు క్షేత్రస్థాయి అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ బృందాలు ప్రైమరీ కాంటాక్టుల ఇళ్లకు వెళ్లినప్పుడు, కొందరు తమకు కరోనా లక్షణాలు లేవని వాదిస్తున్నారు. మరికొందరు తమవారు బయటకెళ్లారని చెబుతున్నారు. వారు స్వీయ నిర్బంధంలో ఉన్నారా? లేదా? అన్నది తెలియడంలేదు. కొవిడ్‌-19 లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహించాలన్న నిబంధన ఉండడమూ సమస్యగా మారింది.

33 మందికి నిర్ధారణ...

గ్రేటర్‌ వ్యాప్తంగా శుక్రవారం 33 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. జియాగూడలో మొత్తం కేసుల సంఖ్య 90కి చేరుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

మూసారాంబాగ్‌కూ పాకింది...

మూసారాంబాగ్‌లోని సలీంనగర్‌లో 2, ఓల్డ్‌ మలక్‌పేట అఫ్జల్‌నగర్‌లో ఓ కేసు నమోదైంది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సన్నిహిత సంబంధాలున్న 10 మందిని క్వారంటైన్‌ చేశారు.

చిలకలగూడ ఠాణా పరిధిలో కంటెయిన్‌మెంట్‌ జోన్...‌

చిలకలగూడ ఠాణా పరిధిలోని బౌద్ధనగర్‌కు చెందిన ఓ వ్యక్తి(66)కి పాజిటివ్‌ రావడం వల్ల, ఆయన నుంచి భార్య(62), కుమారుడు(25)లకు వైరస్‌ వ్యాపించింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు నివసించే ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌ చేశారు.

రైల్వేస్టేషన్‌ నుంచి ఆసుపత్రికి...

ప్రత్యేక రైళ్లలో శుక్రవారం సికింద్రాబాద్‌ చేరుకున్న 249 మంది ప్రయాణికుల్లో ఓ చిన్నారితోపాటు 10 మందికి జ్వరం, జలుబు లక్షణాలు ఉండటంతో కింగ్‌కోఠిలోని ఆసుపత్రికి తరలించారు.

కానిస్టేబుల్‌కు...

మన్సూరాబాద్‌ డివిజన్‌ శ్రీరామహిల్స్‌ కాలనీలో ఉంటూ జియాగూడ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి(33)కు పాజిటివ్‌ వచ్చినట్లు హయత్‌నగర్‌ సర్కిల్‌ డీసీ మారుతిదివాకర్‌ తెలిపారు. ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించి, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె సహా మొత్తం 13 మందిని బల్కంపేటలోని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. హయత్‌నగర్‌ సర్కిల్‌ ఎస్‌కేడీనగర్‌లో కంటెయిన్‌మెంట్‌ జోన్‌ను శనివారం ఎత్తివేస్తామన్నారు.

సెంచరీకి చేరువలో జియాగూడ...

పాజిటివ్‌ కేసులు జియాగూడలో సెంచరీకి చేరువవుతున్నాయి. ఇప్పటికే 86 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా శుక్రవారం మరో నలుగురికి నిర్ధారణ అయింది. డివిజన్‌లోని వెంకటేశ్వరనగర్‌, దుర్గానగర్‌, సాయిదుర్గానగర్‌, శ్రీసాయినగర్‌, సంజయ్‌నగర్‌, ఇందిరానగర్‌, కార్వాన్‌లోని సబ్జిమండి, పన్నీపుర, ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.