బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రముఖ పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు.. అరవింద్ కుమార్‌కు సవాల్ విసిరారు. ఇందులో భాగంగా పార్కులో జువ్వి, మహాఘని, రేలా మొక్కలను అర్వింద్ కుమార్ నాటారు. నెక్లెస్‌రోడ్‌లోని పీ.వీ ఘాట్ ఆవరణలోనూ మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్‌లోని యు.ఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రేఫ్‌మ్యాన్, బ్రిటీష్ డిప్యూటి హై కమిషనర్ హాండ్రూ ఫ్లెమింగ్, అక్కినేని అమలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
ఇవీ చూడండి: దేశంలోనే అత్యంత ఎత్తయిన 'శివలింగం' ఇదే..