ETV Bharat / state

ఏపీ అంతటా తెదేపా కీలక నేతల గృహ నిర్బంధం - arrested tdp leaders in andhrapradesh

ఆంధ్రప్రదేశ్​ ​​​​​​​రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులపై వైకాపా నేతలు చేస్తున్న దాడులకు నిరసనగా తెదేపా చేపట్టిన ‘చలో ఆత్మకూరు’ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఆత్మకూరుకు బయలుదేరారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తెదేపా కీలక నేతలతో సహా పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. చంద్రబాబుతో సహా.. ఎమ్మెల్యేలు, నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కీలక నేతల గృహ నిర్బంధం
author img

By

Published : Sep 11, 2019, 9:25 AM IST

ఏపీ అంతటా తెదేపా కీలక నేతల గృహ నిర్బంధం

తెలుగుదేశం 'చలో ఆత్మకూరు' నేపథ్యంలో టెన్షన్​ వాతావరణం నెలకొంది. చలో ఆత్మకూరుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని కూడా గృహ నిర్బంధం చేశారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడులను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే గోవిందుడును అరెస్ట్ చేసి పున్నమి గెస్ట్‌హౌస్‌కు తరలించారు. ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబును, రాజేంద్ర ప్రసాద్, ఎంపీ కేశినేని నాని, నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు, సింహాద్రి యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి ఆత్మకూరుకు బయలుదేరిన నారా లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

తాడేపల్లి సమీపంలో దేవినేని అవినాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో అవినాష్, తెదేపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఆత్మకూరు నుంచి చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఎన్టీఆర్ భవన్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ'

Intro:JK_AP_RJY_ 61_10_MIRAPA_MUDADA_THEGULU_AVB_AP10022

Body:JK_AP_RJY_ 61_10_MIRAPA_MUDADA_THEGULU_AVB_AP10022

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.