ETV Bharat / state

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెట్టారా..? డిస్కంలకు ఈఆర్​సీ లేఖ

DTR Meters not Started in Telangana : రాష్ట్రంలో ఇప్పటి వరకు వ్యవసాయ బోర్లకు కరెంటు సరఫరా చేసే పంపిణీ ట్రాన్స్​ఫార్మర్ల వద్ద మీటర్ల ఏర్పాట్లు ఇంకా మొదలుకాలేదు. గత ఏడాది మార్చిలోగా ఏర్పాట్లు పార్రంభించాలని ఆదేశించినా.. డిస్కంలలో స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు ఎన్ని మీటర్లు పెట్టారనే దానిపై వివరణ ఇవ్వాలని ఈఆర్​సీ డిస్కంలకు లేఖ రాసింది.

DTR Meters
DTR Meters
author img

By

Published : Apr 9, 2023, 9:52 AM IST

DTR Meters not Started in Telangana : తెలంగాణలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా చేసే పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌) వద్ద మీటర్ల ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ) 2022 మార్చి నెలాఖరులోగా మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాలని ఆదేశించినా విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లలో ఎలాంటి స్పందన లేదు. ఈ ఏడాది మార్చి ముగిసినా ఇంతవరకూ కనీసం మీటర్ల కొనుగోలు కూడా ప్రారంభించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ డీటీఆర్‌లకు ఇప్పటికిప్పుడు మీటర్లు పెట్టాలంటే రూ.98 కోట్లు అవసరమని, అన్ని నిధులు లేనందున ఆర్‌ఈసీని రుణం అడిగినట్లు డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలిపాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని డీటీఆర్‌లకు మీటర్లు పెట్టారనే వివరాలు ఇవ్వాలని తాజాగా డిస్కంలకు ఈఆర్‌సీ లేఖ రాసింది. తెలంగాణ ఏర్పడిన 2014-15లో 18 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లుండగా 11,671.24 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగమైంది. కానీ రాష్ట్రంలో 2022-23లో బోర్ల కనెక్షన్ల సంఖ్య 27 లక్షలు దాటడంతో వినియోగం 20 వేల మి.యూ.లు దాటిపోయినట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి. బోర్ల వద్ద గానీ, డీటీఆర్‌ల వద్ద కానీ మీటర్లు లేకుండా ఎలా కచ్చితంగా ఈ యూనిట్ల లెక్కలను అంచనా వేస్తారని ఈఆర్‌సీ ప్రశ్నిస్తోంది.

తెలంగాణ విద్యుత్‌ గరిష్ఠ డిమాండు పెరగడం వల్ల డిస్కంలు గత ఏడాది డిసెంబరు నుంచి మార్చి వరకూ రూ.4 వేల కోట్లను వెచ్చించి అదనపు కరెంటును ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’లో కొన్నాయి. కొన్న కరెంటులో ఎక్కువ వినియోగం వ్యవసాయ బోర్లకు ఉన్నందునే గరిష్ఠ డిమాండు పెరుగుతున్నట్లు డిస్కంలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయానికి వినియోగానికి ఎంత కరెంటును వాడుతున్నారనే లెక్కలను తేల్చడానికి డీటీఆర్‌ల వద్ద మీటర్లు పెట్టాలని అడుగుతోంది ఈఆర్‌సీ.

వచ్చే నెల నుంచి తనిఖీలు చేస్తాం : 'ప్రతి వ్యవసాయ డీటీఆర్‌కు మీటరు ఏర్పాటు పనులను పరిశీలించడానికి వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తాం. డీటీఆర్‌లకు మీటర్లు పెట్టకపోతే డిస్కంలకు నిబంధనల ప్రకారం జరిమానా వేస్తాం. వ్యవసాయ కరెంటుకు ప్రభుత్వం ఏటా ప్రజాధనాన్ని రాయితీగా రూ.10 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. ఈ సొమ్ము నిజంగా రైతులకు చేరి సద్వినియోగమవుతుందా.. లేదా? అనేది తేలాలంటే ప్రతి డీటీఆర్‌ వద్ద డిస్కంలు మీటర్లు పెట్టాల్సిందే. రైతులకు ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారనే లెక్కలను చెప్పి తీరాల్సిందే.'-శ్రీరంగారావు, ఛైర్మన్‌, ఈఆర్‌సీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.