రానున్న రెండు మూడు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆర్మీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా స్పందించేందుకు తొమ్మిది సహాయక బృందాలు బోట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. అవసరాన్ని బట్టి మరికొన్ని బృందాలను రంగంలోకి దింపుతామని ప్రకటించింది.
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన బండ్లగూడ ప్రాంతంలో 153 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహరాన్ని అందించినట్లు వివరించింది. ప్రస్తుతం కర్ణాటకలోని బీమ, కృష్ట నదుల వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం 6 వరద సహాయక బృందాలు బోట్లు, వైద్య సామగ్రితో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపింది. 427 మందిని పునరావాసాలకు తరలించి వారికి ఆహారం పొట్లాలను అందించినట్లు ఆర్మీ వెల్లడించింది.
ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్