ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కీలక సమావేశం ఎల్బీ నగర్లోని హిమగిరి గార్డెన్లో జరిగింది. రాష్ట్ర, జిల్లా నేతల సమావేశంలో ఏఆర్ రెడ్డిని ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరి సహకారంతో సమస్యల సాధనకై కృషిచేస్తానని ఏఆర్ రెడ్డి తెలిపారు.
అశ్వద్ధామారెడ్డి టీఎంయూ ప్రధానకార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అశ్వద్ధామారెడ్డి పేర్కొన్నారు. కొత్త ప్రధాన కార్యదర్శిపై మూడు నెలలుగా అంతర్గత చర్చలు కొనసాగాయని.. చివరకు నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నట్లు టీఎంయూ వెల్లడించారు.