హైదరాబాద్ పేట్లబురుజు ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే బాలరాజు గత కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. తాగుడు మానేయమని కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు. మానసికంగా కుంగిపోయిన బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అంబర్‌పేట ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే 20 కేసులు