పండగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడపనుంది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని స్పష్టం చేసింది. రద్దీకి అనుగుణంగా ఈ ఏర్పాటు చేస్తామని సంస్థ అధికారులు తెలిపారు.
ఈ కథనం చదవండి: ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి