ETV Bharat / state

నెలాఖరు నుంచి టీఎస్-బీపాస్ అమలు.. ఇకపై సులభంగా అనుమతులు - ts bpass bill approved in assembly

రాష్ట్రవ్యప్తంగా ఇకపై ఇంటి నిర్మాణ అనుమతుల్లో వేగంతో పాటు, పారదర్శకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన టీఎస్-బీపాస్​ బిల్లు ఆమోదం పొందింది. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. టీఎస్‌-బీపాస్‌ భవన నిర్మాణ అనుమతుల్లో సమయపాలన, నిబంధనలు పాటించేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం టీఎస్‌-బీపాస్‌ ఛేజింగ్‌సెల్‌ను ఏర్పాటు చేస్తారు.

tsbpass bill for easy permissions for house constructions
నెలాఖరు నుంచి టీఎస్-బీపాస్ అమలు.. ఇకపై సులభంగా అనుమతులు
author img

By

Published : Sep 15, 2020, 6:15 AM IST

రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇక నుంచి సులభంగా లభించనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్‌-బీపాస్‌ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన ఏక గవాక్ష విధానం టీస్‌-ఐపాస్‌ తరహాలºనే టీఎస్‌-బీపాస్‌ ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి అనుమతి అవసరంలేదు. 75 చదరపు గజాల కంటే ఎక్కువ 600 చదరపు గజాల లోపు(500 మీటర్ల కంటే తక్కువ), పదిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి లభిస్తుంది. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస, నివాసేతర భవనాలకు కొత్త చట్టం ప్రకారం 21 రోజుల్లో అనుమతి వస్తుంది.

tsbpass bill for easy permissions for house constructions
గత మూడేళ్లలో రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు

టీఎస్‌-ఐపాస్‌ తరహాలో వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు, నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తుదారుడు ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరంలేదు. ఉమ్మడి దరఖాస్తు దాఖలు చేస్తే అగ్నిమాపక, సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు, విమానయాన సంస్థల అనుమతికి దరఖాస్తు ఆటోమెటిక్‌గా వెళ్తుంది. సంబంధిత శాఖలు రిమార్కులను వారం నుంచి 15 రోజుల్లో పంపాలి. ఈ నిబంధన కూడా 600 చ.గ.పైబడిన నిర్మాణాలకే. టీఎస్‌-బీపాస్‌ భవన నిర్మాణ అనుమతుల్లో సమయపాలన, నిబంధనలు పాటించేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం టీఎస్‌-బీపాస్‌ ఛేజింగ్‌సెల్‌ను ఏర్పాటు చేస్తారు.

టీఎస్​ బీపాస్​లో ప్రత్యేకతలు

600 గజాలు దాటిన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 22వ రోజు పట్టణ ప్రణాళిక అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజముద్రతో అనుమతి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధాన (టీఎస్‌-బీపాస్‌) చట్టాన్ని తెచ్చేముందు సమీక్షించాం. అందులో 95 శాతం దరఖాస్తులు 600 గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు సంబంధించినవే. అంటే ఈ చట్టం వల్ల 95 శాతం మందికి భవన నిర్మాణ తిప్పలుండవు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆనందాన్నిచ్చే బిల్లు ఇది’

- ఐటీ, పురపాలక శాఖ మంత్రి, కేటీఆర్‌

తెలంగాణలో పట్టణాలు, నగరాల్లో 61.4 శాతం పైగా భవన నిర్మాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరుగుతున్నాయి. గత మూడేళ్లలో భవన నిర్మాణ అనుమతులను పురపాలకశాఖ విశ్లేషించింది.

నోటీసు ఇవ్వకుండా కూల్చడం మంచిది కాదు: భట్టి

దరఖాస్తు చేసుకున్న తర్వాత 21 రోజుల్లో అనుమతి ఇవ్వనందున 22వ రోజు నుంచి అనుమతి వచ్చినట్లుగా భావించి భవన నిర్మాణం ప్రారంభించిన తర్వాత అధికారులొచ్చి నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తామని చెబితే ఎలా అని కాంగ్రెస్‌ సభాపక్షనేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఒక అవకాశం ఇవ్వడం ప్రాథమిక హక్కు కదా? దాన్ని లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. కనీసం 5-7 రోజుల సమయం ఇచ్చి చూడాలన్నారు. దానిపై మంత్రి కేటీఆర్‌ సమాధానమిస్తూ అధికారులపైనా జరిమానా విధింపు లాంటి చర్యలుంటాయన్నారు. ప్రజలపై విశ్వాసం ఉంచి అనుమతులను సరళతరం చేసినప్పుడు నిబంధనల ఉల్లంఘనపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు మరో 45 రోజుల గడువు పెంపు

నోటరీ ద్వారా స్థలాలున్న వారికి కూడా అనుమతులివ్వాలని కొందరు సభ్యులు కోరారని, దానిపై వన్‌ టైమ్‌ రిలీఫ్‌ ఇవ్వాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని కేటీఆర్‌ చెప్పారు. ఇంటి పన్నులు, నీటి బిల్లులకు సంబంధించి కూడా వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌కు మరో 45 రోజుల గడువు పెంచుతామని, అక్టోబరు 31వ తేదీ వరకు అవకాశం ఇస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండిః టీఎస్ బీపాస్ సహా కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.