ETV Bharat / state

పండగవేళ... ధర తగ్గిన యాపిల్​ పండ్లు - apples

గణేష్​ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మార్కెట్​లో పండో, పువ్వో కొందామంటే అడ్డగోలు రేట్లు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఓ పండ్లకి రెట్లు పడిపోయాయి. హిమాచల్​ ప్రదేశ్​లో భారీగా కురిసిన వర్షాలకు యాపిల్స్​ దిగుమతి ఆగిపోయి ప్రస్తుతం ఒకేసారి నగరానికి వచ్చాయి. గడ్డి అన్నారం మార్కెట్లో కిలో రూ.20 నుంచి రూ.30 వరకు తక్కువకే చిల్లర వర్తకులు విక్రయిస్తున్నారు.

పండగవేళ... ధర తగ్గిన యాపిల్​ పండ్లు
author img

By

Published : Sep 4, 2019, 8:01 PM IST

వినాయక చవితికి మార్కెట్​లో పూలతో పాటు పండ్లకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో పండ్ల రేట్లు కొంచెం పెరుగుతుంటాయి. కానీ యాపిల్ పండ్ల పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం కిలో యాపిల్స్ ధర సాధారణం కంటే రూ.20 నుంచి రూ.30 వరకు తక్కువకే చిల్లర వర్తకులు విక్రయిస్తున్నారు.

భాగ్యనగరానికి యాపిల్స్ హిమాచల్ ప్రదేశ్ , జమ్ముకశ్మీర్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇటీవల ఉత్తరాదిలో భారీ వర్షాల ప్రభావం వల్ల... అక్కడి నుంచి యాపిల్స్ ఎగుమతి ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులన్ని చక్కబడ్డాక ఒకే సారి భారీ స్థాయిలో మార్కెట్లోకి యాపిల్స్ వచ్చాయి. దాని ప్రభావంతో ధరల తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

సాధారణంగా ఆగస్టు నుంచి మొదలు కొని ఐదు నెలల వరకు యాపిల్ సీజన్ ఉంటుంది. అయితే క్రితం ఏడాది ఇదే కాలంలో ధరలు సాధారణంగానే ఉన్నాయి. నగరంలో ప్రముఖమైన గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ లో టోకు విక్రయం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్​కు హిమాచల్ ప్రదేశ్ నుంచి దిగుమతి అవుతుండగా.. కశ్మీర్ యాపిల్స్ మరో 15 రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఇక్కడ సాధారణంగా రూ.3400కు అమ్ముడయ్యే యాపిల్స్ డబ్బా… ప్రస్తుతం రూ.2వేల స్థాయిలో విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.

పండగవేళ... ధర తగ్గిన యాపిల్​ పండ్లు

ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు

Intro:Body:TG_HYD_54_03_ATTN_ETVBHARAT_APPLES_RATES_GONE_DOWN_DUE_TO_RAINS_7202041

వినాయక చవితి అంటే విగ్రహాలతో పాటు పండ్లకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో పండ్ల రేట్లు కొంచెం పెరుగుతుంటాయి. కానీ యాపిల్ పండ్ల పరిస్థితి మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంది. హైదరాబాద్ లో మాత్రం యాపిల్ పండ్ల రేట్లు మాత్రం తగ్గాయి. కిలో యాపిల్స్ ధర సాధారణం కంటే రూ.20 నుంచి రూ.30 వరకు తక్కువకే చిల్లర వర్తకులు విక్రయిస్తున్నారు.
భాగ్యనగరానికి యాపిల్స్ హిమాచల్ ప్రదేశ్ , జమ్ముకశ్మీర్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతాయి. ఇటీవల ఉత్తరాదిలో భారీ వర్షాల ప్రభావం వల్ల వరదలు వచ్చాయి. దీనితో కొన్ని రోడ్లు మూతపడటంతో అక్కడి నుంచి యాపిల్స్ ఎగుమతి ఆగిపోయింది. ప్రస్తుతం ఒకే సారి భారీ స్థాయిలో మార్కెట్లోకి యాపిల్స్ వచ్చాయి. దాని ప్రభావంతో ధరల తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
వినాయక చవితి ప్రభావం...
వినాయక చవితి కంటే ముందు కొంచెం మాత్రమే ఉన్న తగ్గుదల, దాని అనంతరం మరింత ఎక్కువైందని వర్తకులు అంటున్నారు. వర్షాల వల్ల కూడా ప్రజలు సాధారణంగానే పండ్లపై మక్కువ చూపించరని వారు తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి...
సాధారణంగా ఆగస్టు నుంచి మొదలు కొని ఐదు నెలల వరకు యాపిల్ సీజన్ ఉంటుంది. అయితే క్రితం ఏడాది ఇదే కాలంలో ధరలు సాధారణంగానే ఉన్నాయి. నగరంలో ప్రముఖమైన గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ లో టోకు విక్రయం జరుగుతుంది. స్థానిక వర్తకులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ పండ్లు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు.
ప్రస్తుతం భాగ్యనగరానికి హిమాచల్ ప్రదేశ్ నుంచి దిగుమతి అవుతుండగా… కశ్మీర్ యాపిల్స్ మరో 15 రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఇక్కడ సాధారణంగా రూ.3400కు అమ్ముడయ్యే యాపిల్స్ డబ్బా… ప్రస్తుతం రూ.2వేల స్థాయిలో విక్రయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.

బైట్ : జైపాల్, యాపిల్స్ వ్యాపారి, గడ్డిఅన్నారం మార్కెట్
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.