ETV Bharat / state

నేడే అపెక్స్ కౌన్సిల్ సమావేశం... వాదనలతో తెలుగు రాష్ట్రాలు సిద్ధం - సీఎం కేసీఆర్​

నదీజలాల వివాదాలపై అత్యున్నత మండలి రెండో సమావేశం నేడు మధ్యాహ్నం జరగనుంది. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల నేపథ్యంలో జరుగుతున్న భేటీ ఆసక్తిరకంగా మారింది. రాష్ట్ర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనను తిప్పికొట్టడంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాగా కేటాయింపులు చేయాలని, గోదావరి జలాల్లో అదనంగా నీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.

apex council meet today in delhi
నేడే అపెక్స్ కౌన్సిల్ భేటీ.. పాల్గొననున్న ఇరురాష్ట్రాల సీఎంలు
author img

By

Published : Oct 6, 2020, 5:35 AM IST

Updated : Oct 6, 2020, 6:03 AM IST

జల వివాదాలపై తెలుగు రాష్ట్రాలు తమ వాదనలతో సిద్ధమయ్యాయి. నేడు జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తమ వాదనలను గట్టిగా వినపించనున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. నాలుగు అంశాలను ఎజెండాగా నిర్ణయించినప్పటికీ వీటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అపెక్స్‌ కౌన్సిల్‌ ఎజెండాలోని అంశాల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సోమవారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు, కేంద్ర జల్‌శక్తి అధికారులతో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు లేవనెత్తే అవకాశమున్న అంశాలు... కేసీఆర్​ లేఖలో ప్రస్తావించిన విషయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలి

బోర్డులు ఏర్పడి ఆరేళ్లు దాటినా ఇప్పటివరకూ పరిధిని నోటిఫై చేయకపోవడం... దీంతో తలెత్తుతున్న సమస్యల గురించి... దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి.. తదితర అంశాలను కేంద్ర మంత్రి తెలుసుకున్నారు. పరిధి నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంటుండగా... నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. ఇప్పటికే ఉన్న నాగార్జునసాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్‌ చేయనుండగా... రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ కోరనున్నట్లు తెలిసింది.

అంగీకారానికి రాకపోతే కొత్త ట్రైబ్యునల్‌

ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ... పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాల్సిందేనని... దీనిపై కూడా సమావేశంలో స్పష్టంగా చెప్పాలని కేంద్రమంత్రి సంబంధిత అధికారులతో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని... కొత్తవి చేపట్టకుండా డీపీఆర్​లు ఎలా ఇస్తామని తెలంగాణ ప్రశ్నిస్తోంది. కృష్ణా బేసిన్‌లో ఇప్పటికే ఉన్న ట్రైబ్యునల్‌ కొనసాగుతుందని... గోదావరిలో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ అంగీకారానికి రాకపోతే కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు అవసరం గురించి కేంద్రమంత్రి చర్చించినట్లు తెలిసింది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా విషయాన్ని తేల్చే బాధ్యతను ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే వదిలిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కృష్ణా జలాలపై విచారణ జరపాలి

కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లపై విమర్శలు గుప్పిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రికి ఈనెల 2న లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్​... సోమవారం కూడా నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. నీటీ పారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌ నుంచి కేసీఆర్ వీడియో ద్వారా ఆపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం- 1956లోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జలాలపై విచారణ జరపాలని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో గట్టిగా కోరనున్నారు. దీంతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని డిమాండ్‌ చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని మరోసారి స్పష్టం చేయనున్నారు.

అందుకే రాయలసీమ ఎత్తిపోతలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం రాత్రి దిల్లీలో అధికారులతో ఈ విషయమై మరోమారు చర్చించినట్లు తెలిసింది. దిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనపు నీటి వినియోగం, కొత్త ఆయకట్టు లేదని... ఉన్న ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికే అని గట్టిగా చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలోని ప్రాజెక్టులకు శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తీసుకోవచ్చని... కానీ ఏపీలోని ప్రాజెక్టులకు ఆ వెసులుబాటు లేదని.. అందుకే రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకతను వివరించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వీలైనంత త్వరగా బోర్డు

ఇటు... కృష్ణానది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు తరలించాల్సి ఉంది. గతంలో విజయవాడకు తరలించాలనే ప్రతిపాదన ఉండగా... ఇప్పుడు కర్నూలు, వైజాగ్‌ల గురించి చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. కర్నూలు వైపు చూపుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు మార్చాలని ఏపీ కోరనున్నట్లు తెలిసింది. ఎవరి వాదనలు వారు గట్టిగా వినపించనున్న నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్దుష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుందో లేదో వేచి చూడాలి.

ఇదీ చదవండి: 'తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా దీటుగా సమాధానాలు'

Last Updated : Oct 6, 2020, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.